ప్రియురాలు ఐఫోన్ అడిగిందని అడ్డంగా బుక్కైన ప్రియుడు
రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోరిక తీర్చడం కోసం ఓ యువకుడు తన జీవితాన్ని రిస్కులో పడేసుకున్నాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న తప్పులు వారిపై నేరస్తుడు అనే ముద్ర పడేలా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మత్తు వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులే అత్యధికంగా మత్తుకు బానిస అవుతున్నారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మత్తుకు బానిసలుగా మారుతుంటే.. మరికొందరు ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాలు సరఫరా చేసే వృత్తిని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఆమె కోరిక తీర్చేందుకు ఓ యువకుడు గంజాయి సప్లయర్‌గా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య.. హేమలత ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఒడిశాకు వెళ్లి రూ.16 వేలకు 12 కేజీల గంజాయి కొనుగోలు చేసిన చైతన్య.. హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అతని ప్రియురాలు కూడా ఉన్నట్టు సమాచారం.
