తెలంగాణ

వెయ్యి ఎకరాల భూమి కబ్జాకు కుట్రలు- బొమ్మరాసిపేట రైతుల ధర్నా

Bommarasipet Lands: మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు, భూ మాఫియా కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి బొమ్మరాసిపేటలోని భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెయ్యి ఎకరాల భూమి కబ్జాకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా శామీర్ పేట రెవెన్యూ ఆఫీస్ ముందు బొమ్మరాసిపేట రైతులు ధర్నా నిర్వహించారు. తమ భూ సమస్యలు వెంటనే పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.