సినిమా
Bollywood: "వెంటిలేటర్ 2"పై ప్రియాంక చోప్రా ఆసక్తి ఎందుకు?
Bollywood: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘వెంటిలేటర్ 2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ప్రియాంకకు ఇంత ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు? దీని వెనుక కేవలం నిర్మాతగా ఉన్న అనుబంధమే కాకుండా, తన తండ్రితో ముడిపడిన ఒక ఎమోషనల్ కారణం కూడా ఉంది.
