సినిమా
Bollywood: డెడ్లీ కాంబో..ఆర్జీవి కథతో మోహిత్ సూరి సినిమా.!
Bollywood: ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. అలాంటి క్రేజీ డెడ్లీ కాంబినేషన్‌గా ఆర్జీ-మోహిత్ సూరిలది నిలవబోతోంది. ఇప్పుడు ఆర్జీవి కథ, మోహిత్ సూరి దర్శకత్వం అనే వార్త బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సంచలన కథలకు, విభిన్నమైన ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. మరోవైపు ప్రేమకథల్లోనూ, ఇంటెన్స్ ఎమోషన్స్‌లోనూ తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి. ఈ ఇద్దరి క్రియేటివిటీ కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అన్నే చర్చ మొదలైంది.
