తెలంగాణ
నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రం నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అడ్డాగా మారిందన్న ఘటన బోధన్‌లో కలకలం రేపుతోంది. రాకాసిపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యవహారం పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు భారీగా నకిలీ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
