తెలంగాణ
MILK rates : దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ పెరిగిన పాల ధరలు!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే పాల ధరలను మరోసారి పెంచుతూ 'మదర్ డెయిరీ' ప్రకటించింది. లిక్విడ్ పాల ధరలను లీటరుకు రూ. 2 నుండి రూ. 4 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు రేపు (గురువారం) నుండి అమలులోకి రానున్నాయి. పాలను సేకరణ ఖర్చులు , ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లే ధరలను పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ వర్గాలు వెల్లడించాయి.తాజా పెంపుదలతో దేశవ్యాప్తంగా ధరలు పెరిగినట్టు సమాచారం. మదర్ డెయిరీకి అత్యంత ప్రధాన మార్కెట్ అయిన ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్లో పాల ఉత్పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ క్రీమ్ పాలు లీటరుపై రూ. 4 పెరిగింది. అనగా పాత ధర రూ. 72 ఉండగా.. ఇప్పుడు రూ. 76కి చేరింది.
