తెలంగాణ

కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున జరిగిన తీవ్ర ఉద్రిక్తతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మండలి నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం సస్పెన్షన్‌కు గురయ్యారు. కాసేపటి క్రితం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, తాజాగా కేటీఆర్ పీఆర్ఓ, పీఏ మీద కూడా కేసు నమోదైంది.