సినిమా
Bloody Romeo: బ్లడీ రోమియోతో నాని హిట్ కొట్టాలిందే!
నాని కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాతోనూ తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలంటే సరైన కథలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బ్లడీ రోమియో విషయంలో నాని, సుజీత్ ఇద్దరూ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా, అభిమానులు కోరుకునేది ఒక్కటే. ఈ మధ్య సరైన హిట్ లేదు గనక నాని నుంచి సాలీడ్ హిట్ రావాలి. అది కూడా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా కావాలి. బ్లడీ రోమియోతో నాని తన సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి వస్తారా? సుజీత్ తన స్టైలిష్ టేకింగ్‌తో నానికి బ్లాక్‌బస్టర్ అందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
