National
భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్సభ ఎన్నికలపై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.జనవరిలో నిర్వహించిన సర్వేలో 352 సీట్లు ఎన్డీయేకు వస్తాయని అంచనా వేయగా.. తాజాగా ఈ సంఖ్య 326కు పడిపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీ 261 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. కాగా, 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 106 సీట్లు గెలుచుకోగలదని వెల్లడించింది.
