National
నేహాబోరా వివాదాస్పద వ్యాఖ్యలు అస్త్రంగా.. బీజేపీ రాజకీయం!
విద్యార్థి కార్యకర్త నేహా బోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘బ్రాహ్మణీయ వ్యవస్థ’ నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని, ఆలయాల్లో పూజారులు లైంగికదాడులకు పాల్పడుతున్నారంటూ నేహా బోరా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ(BJP) తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ చేసిన విమర్శలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
