తెలంగాణ

కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!

BJP: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు కలిసి మాట్లాడుకోవడం, కార్యక్రమాల సందర్భంగా ఒకే టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి దృశ్యాలు కూడా రాజకీయ విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బ్రేక్‌ఫాస్ట్ వ్యవహారం ఇదే పరిస్థితిని తెచ్చిపెట్టింది.తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడే అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.