National

BJP : చర్చకు సిద్ధం.. సభకు వస్తారా? రాద్ధాంతం చేస్తారా? : అమిత్ షా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వాయిదాలు ఆరు గందరగోళాలు అన్నట్టుగా సాగుతున్నాయి. సెషన్స్ ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు అర్థవంతమైన చర్చ జరగలేదు. నీట్ గందరగోళం, విద్యార్థులనిరసనలు, అరెస్టులు, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా తర్వాత.. కేంద్రం యాంటీ పేపర్ లీక్ తెచ్చిన విషయం తెలిసిందే.అయితే, విద్యార్థుల మీద లాఠీచార్జ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? దీని మీద కేంద్రహోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటులో బిల్లులు పెట్టకుండా, చర్చ జరగకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారు. ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు మేం సిద్ధమని ప్రకటించారు. చర్చలకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని, విపక్షాలు హంగామా మాని చర్చకు ముందుకు రావాలని లోక్‌సభలో స్పష్టం చేశారు.