National
BJP: కేంద్ర మంత్రులకే నో ఛాన్స్.. రాజ్యసభ లిస్ట్‌లో బీజేపీ బిగ్ ట్విస్ట్!
BJP: ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రులకే షాక్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్లో కీలక శాఖలు నిర్వహిస్తున్న హర్దీప్ సింగ్ పూరి, బన్వారీలాల్ వర్మ వంటి ప్రముఖులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం కల్పించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అక్టోబర్ 16న జరగనున్న ఎన్నికల కోసం కాషాయ దళం ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థులలో ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా తిరిగి స్థానం దక్కలేదు. కేంద్ర మంత్రులతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్, సీమా ద్వివేదీ, నీరజ్ శేఖర్, గీతా శాక్య వంటి కీలక నేతల పదవీకాలం ముగుస్తున్నప్పటికీ వారిని పక్కన పెట్టారు.
