తెలంగాణ

BJP: తెలంగాణకు సునీల్‌ భన్సల్‌.. రాష్ట్రాలకు కొత్త బీజేపీ ఇన్‌ఛార్జిలు

BJP: దేశవ్యాప్తంగా సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం కీలక కార్యాచరణను చేపట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యులకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తూ కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్‌ఛార్జిలు, కో-ఇన్‌ఛార్జిల పేర్లను ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకులను నియమించారు.రాజకీయ వ్యూహాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత సునీల్ భన్సల్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ పార్టీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ఆయనకే కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, సమన్వయంపై దృష్టి సారించే క్రమంలో భన్సల్ అనుభవం రెండు రాష్ట్రాల్లో కీలకంగా మారనుంది.