తెలంగాణ

బీజేపీ ఆఫీసులపై దాడులు.. నితిన్ నబీన్ సీరియస్

Nitin Nabin: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆఫీసులపై దాడులు, ఆ పార్టీ నేతల అరెస్టులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పందించారు. రేవంత్ సర్కార్ పై ఆయన సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. బీజేపీ నేతల అరెస్టులపై తాను రాంచందర్ రావుతో ఫోన్ లో మాట్లాడినట్లు నితిన్ నబీన్ వెల్లడించారు. కాంగ్రెస్ అరాచక ముఠాలు దాడులు చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ నాయకులు వస్తే మాత్రం అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే నీతులు కేవలం నాటకమే అని విమర్శించారు. రేవంత్ సర్కార్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు.