తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలకు కారణం మా నాన్నే!..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన షెల్ కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు.
