తెలంగాణ
లండన్లో కేసీఆర్తో సీక్రెట్ మీటింగ్.. సీఎం రేవంత్ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారు
Alleti Maheshwar Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లండన్ పర్యటనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లండన్ టూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య సమావేశం జరిగిందన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు సమావేశానికి కొనసాగింపుగానే ఈ సీక్రెట్ మీటింగ్ జరిగిందన్నారు.
