తెలంగాణ

BJP: మిషన్ తెలంగాణపై కాషాయ దళం సర్జికల్ ఆపరేషన్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ లీక్!

BJP: తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తున్న బీజేపీ పార్టీ తన కార్యాచరణను అనూహ్యంగా మార్చేసింది. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో సమానమైన బలం లేదన్న వాస్తవాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

ముఖ్యంగా పార్టీ ఉనికికే సవాలుగా మారిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఇక తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు అత్యంత సన్నిహితుడైన కీలక నేతను నేరుగా రంగంలోకి దించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.గత ఎన్నికలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓట్ షేర్ పెరిగినప్పటికీ, అది కొన్ని బలమైన ప్రాంతాలకే మాత్రమే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల విషయానికి వచ్చేసరికి కాషాయ పార్టీ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ మూడు జిల్లాల్లో ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ ప్రాంతాల్లో పాగా వేయకుండా తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యమని క్లారిటీకి వచ్చిన అధిష్ఠానం.. ఇప్పుడు ఇక్కడే ప్రయోగాత్మకంగా ‘ట్రయల్ రన్’ స్టార్ట్ చేయాలని భావిస్తోంది.