తెలంగాణ

బీఆర్ఎస్‌పై విమర్శలు, ఆరోపణలే తప్ప ఆధారాలు ఏవి?

Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల విలువైన భూ అక్రమాలకు పాల్పడిందంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భూ దందాలో దోపిడీదారులు, కుట్రదారులు ఎవరో బహిర్గతం చేయాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం తప్ప.. ఆధారాలు మాత్రం చూపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ను ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనపై సెటైర్లు వేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సిట్ కాస్త సెట్ అయ్యింది.. సెట్ కాస్త సెట్టింగ్ అవుతుందేమో అని విమర్శించారు.