National
BJP: లక్ష్మణరేఖ దాటేస్తున్న బొద్దింకలు.. ఢిల్లీ పెద్దలకు తప్పని తలనొప్పి!..
‘కాక్రోచ్ జనతా పార్టీ’.. పేరే వెరైటీగా ఉన్నా, ఇప్పుడు యువత, నిరుద్యోగులను ఆకర్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఉద్యోగాలు, ఉపాధి, వ్యవస్థపై అసంతృప్తిని అస్త్రంగా మార్చుకుని సోషల్ మీడియాలో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. అయితే ఈ పార్టీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే.. అదే చర్యలు సానుభూతిగా మారి ఆ పార్టీకే రాజకీయంగా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే బొద్దింకలను అణచడం అంత ఈజీ కాదని.. ఢిల్లీ పెద్దలకు కొత్త తలనొప్పి మొదలైందనే చర్చ సాగుతోంది.
