తెలంగాణ
వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్ధాలు..
Telangana BJP: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్దాల పేరుతో ఈ చార్జ్‌షీట్ ను రిలీజ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయ్యిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
