తెలంగాణ

బీజేపీ బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మ-బొరుసు.. వారి మాయలో పడొద్దు..

బీజేపీ-బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని.. వారి మాయలో ప్రజలు పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ''కేసీఆర్‌ అసెంబ్లీకి రా.. మాట్లాడుదాం” అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణలో నంబర్‌వన్ నాయకుడు అని, ఆయనను కాపాడుకునే బాధ్యత మీది అని రేవంత్ అన్నారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలో రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన భారీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లపై సుదీర్ఘంగా మాట్లాడారు.