తెలంగాణ

bjp: 22A కుట్రదారులెవరో తేల్చాల్సిందే!..

రాష్ట్రంలో 22ఏ  జాబితా పేరుతో లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  దాదాపు కోటి ఎకరాలను ఈ జాబితాలో చేర్చి రైతులను, రియల్టర్లను భయపెట్టి బేరసారాలు జరుపుతున్నారని అన్నారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.