National

Bittu Tabahi: బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువ లేదు.. ఈ జనాలు మారరు!

Bittu Tabahi: ఓ పక్క స్వచ్ఛ భారత్ అంటూ టీవీల్లో, ఫ్లెక్సీల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకుంటున్నాం.. పర్యావరణాన్ని కాపాడాలంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతున్నాం. కానీ గ్రౌండ్ లెవల్‌లో మన బుద్ధి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే పక్కా ఉదాహరణ. 20 ఏళ్ల ఓ కాలేజ్ కుర్రాడు.. తనకు ఈత రాకపోయినా, చేతులకు కనీసం గ్లౌజులు కూడా లేకపోయినా, ప్రాణాలనే ఫణంగా పెట్టి 8 నెలల పాటు రోజూ నదిలో దిగి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు. కానీ చుట్టుపక్కల జనాలు ఏం చేశారు? వారం తిరక్కుండానే మళ్లీ పాత రోజుల్లాగే ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు విసిరేసి నదిని మురికిగుంటలా మార్చేశారు. ఇది చూశాక ఎవరికైనా వచ్చే మాటేమిటంటే.. "బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువే లేదు.. ఈ జనాలు అస్సలు మారరు!".మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీ.. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి'గా అందరికీ తెలుసు. తను సాధారణంగా డిగ్రీ చదువుకుంటున్న కుర్రాడు. రోజూ చూసే అజ్నార్ నది ప్లాస్టిక్ చెత్తతో డంపింగ్ యార్డులా మారి కుళ్లిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ప్రభుత్వాలు పట్టించుకోవని తెలిసింది, అధికారుల వైపు చూస్తే పనవ్వదని అర్థమైంది.