వైరల్ న్యూస్
Birthday Twist: ఊరుకో అక్కా.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?
పుట్టినరోజున భర్త ఇచ్చే బహుమతి కోసం ఏ భార్య అయినా చాలా ఆశగా ఎదురుచూస్తుంది. అందులోనూ ఆ బహుమతి కాస్త పెద్ద సైజులో ఉంటే ఆ ఆనందమే వేరు..! సరిగ్గా అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ భార్య తన పుట్టినరోజు సందర్భంగా భర్త నుంచి ఖరీదైన కారు గిఫ్ట్‌గా వస్తుందని కొండంత ఆశ పెట్టుకుంది. తీరా బహుమతి చూశాక ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది. భార్య బర్త్‌డే రోజు రానే వచ్చింది.. ఇంటి ముందు కారు ఆకారంలో, నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న ఒక పెద్ద గిఫ్ట్ ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే ఆ భార్య సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. తనకు నిజంగానే కారు కొనిచ్చాడని, భర్త ప్రేమను చూసి ఎంతో మురిసిపోయింది. "అబ్బా.. ఎంత మంచి భర్త!" అనుకుంటూ, ఎంతో ఆత్రుతగా ఆ గిఫ్ట్ కవర్‌ను తొలగించడం ప్రారంభించింది.
