క్రైమ్
ప్రముఖ ఆలయంలో విషాదం.. భక్తుల ప్రాణాలు తీసిన తొక్కిసలాట!..
బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సోమవారం కావడంతో శివుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యుత్ షాక్ తగులుతుందనే భయంతో వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మరో 12 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
