సినిమా
Bigg Boss 10 Telugu: నాగ్ బర్త్ డే ట్రీట్..బిగ్ రియాలిటీ షో అప్డేట్ వచ్చేసింది
Bigg Boss 10 Telugu: ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ మా బృందం ప్రోమోను వదిలారు. అలాగే, ఈ షో ఎప్పటి నుంచి మొదలబోతుందో కన్ఫర్మ్ చేశారు. ఈ సెప్టెంబర్ 6,7 తేదీలలో బిగ్ బాస్ 10 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో గ్రాండ్ గా మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ 10 కి హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఎలాంటి మార్పూ లేదని మరోసారి నాగ్ బర్త్ డే సందర్భంగా కన్ఫర్మ్ చేశారు.
