తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.అయితే, స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోందని, భక్తులు అందుకు సహకరించాలని టీటీడీ కోరింది. గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. భక్తులు భారీగా రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరినట్టు సమాచారం. దీంతో టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.
