వీసీ అల్దాస్ జానయ్యకు బిగ్‌షాక్.. విచారణకు గవర్నర్ ఆదేశం
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) అల్దాస్ జానయ్యకు బిగ్ షాక్ తగిలింది.ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను వీసీ జానయ్య లైంగికంగా వేధించారని ఓ మహిళా ప్రొఫెసర్ కన్నీరు పెట్టుకోవడంతో పాటు మీడియాకు అసలు విషయాన్ని వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని వర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందళనకు దిగారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ శవప్రతాప్ శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు.
