ఏపీ
మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన మీద గతంలో నమోదైన సీబీఐ, ఈడీ కేసులను ఇకమీదట రోజువారీగా విచారించాలని హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్ణయించింది. వైఎస్ జగన్‌తో పాటు నిందితులందరినీ వ్యక్తిగతంగా విచారించాలని ఈ సందర్బంగా న్యాయస్థానం ఆదేశించింది.కాగా, దశాబ్దకాలంగా ఈ కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన సత్వర విచారణ హక్కు ప్రకారం, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించాలని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది.ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టులో బలంగా వాదించారు.
