తెలంగాణ

కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. కారెక్కిన NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు

అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగుతోందని పేర్కొంటూ NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు రోజు ఆయన సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ పాలనలో యువకులకు, నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి నాయకుల పెత్తనం పెరిగిందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జెండాలు మోశామని, కానీ గత మూడేండ్లుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు.