తెలంగాణ

హరీశ్ రావుకు బడా కంపెనీలు.. కవిత ఆరోపణలు అక్షర సత్యమేనా?

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావుకు బడా కంపెనీలు ఉన్నాయని, ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై నిన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆసుపత్రులతో వ్యాపారం చేస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని ఆరోపించింది. ARVAIS NATURES PRODUCTS PRIVATE LIMITED (Milchy Milk) హరీశ్ రావు వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కంపెనీ ఒక్క ఏడాదిలోనే 614% వృద్ధి సాధించిందని.. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు దాని రూ.7 కోట్ల మాత్రమే అని తెలిపింది.