తెలంగాణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. పోలీసులను నిలదీసిన భూ బాధితులు!!..

ఆలేరు రాజకీయాల్లో భూవివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బాధితులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారసత్వంగా తమకు వచ్చిన, సుమారు 37 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని తమ నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ భూమికి సంబంధించిన పత్రాలను అక్రమంగా సృష్టించి హక్కులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. శంకర్ నాయక్, చాడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులను ముందుంచి తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు.. పోలీసులను అడ్డుపెట్టుకుని భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారులను నిలదీశారు.