ఏపీ

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్!

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నేడు(సోమవారం) అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో (6E6408) విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఈ నూతన ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి. నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, ప్రయాణికులకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, పౌర విమానయాన శాఖ అధికారులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.