తెలంగాణ

Bhatti Vikramarka: సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం.. భట్టి విక్రమార్క!..

సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను ఆయన స్పష్టంగా వినిపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలని, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందితేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భట్టి అన్నారు. 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు.