తెలంగాణ
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
నేడు తెలంగాణ భాషా దినోత్సవం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు పడిన తర్వాత 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 9వ తేదీన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని 'తెలంగాణ భాషా దినోత్సవం'ను ప్రకటించింది. దీంతో ప్రతి ఏటా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నది. తెలంగాణ మాటకు, మట్టికి, సంస్కృతికి ప్రత్యేకమైన రోజు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజల నిత్య జీవితంలో వినిపించే తెలంగాణ యాసను, మాటల మాధుర్యాన్ని, సాహిత్య వైభవాన్ని గుర్తుచేసుకునే సందర్భమిది.
