బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ అని తుంగతుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీర్ల ఐలయ్య మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఫెండర్ కారు కొన్నానని గతంలో బీర్ల ఐలయ్య దావత్ ఇచ్చాడని, కారుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే తన కొడుకు కొనిచ్చాడని చెప్పాడని గుర్తుచేశారు. ‘స్కూలుకు వెళ్లే నీ కొడుకు కారు ఎలా కొనిచ్చాడు? 15 నుంచి 20 వేల ఎకరాల సీలింగ్ భూములను బ్రోకరిజం చేసి స్పెక్ట్రా అనే సంస్థకు కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నావ్’ అని ఆరోపించారు.‘ఆ సంస్థ దగ్గర ప్లాట్లు కొన్నవాళ్లందరూ ఇప్పుడు మోసపోయారని, ఇలాంటి జోకర్,బ్రోకర్వి నువ్వు కూడా కేటీఆర్ గురించి మాట్లాడతావా?’అంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. ఓడిపోతానని భయంతోనే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సభలు పెట్టాడని, గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి లాగా అవ్వరని అంటున్నారని.. నిజమే కేటీఆర్ ఎన్నటికీ రేవంత్ రెడ్డి లాగా లంగ, దొంగ కాడని విమర్శించారు.
