వైరల్ న్యూస్
పిల్ల చనిపోయిందని.. అక్కాచెల్లెళ్లపై ఎలుగుబంటి దారుణం
పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న అన్నాచెల్లెళ్లపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధిలోని ‘లర్‌గావ్-మర్కటోలా’ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గోర్సే జూరి (50), సోదరుడు హలాల్ జూరి (45) పొలం పనులు ముగించుకుని తమ పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది.
