తెలంగాణ
నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని, దీంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
