తెలంగాణ
TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌కు బీసీఐ షాక్.. ఏకపక్ష నిర్ణయాలపై స్టే!
TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామ్‌రెడ్డి సాములు ఏకపక్ష నిర్ణయాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) గట్టి ఝలక్ ఇచ్చింది. రూల్స్ పక్కనపెట్టి కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై బీసీఐ మధ్యంతర స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామ్‌రెడ్డి, సెక్రటరీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.అక్టోబర్ 11న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, మినిట్స్‌లో నమోదు చేయకుండా రామ్‌రెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్లారని బీసీఐకి ఫిర్యాదులు అందాయి.
