తెలంగాణ
BC Strategy: కాంగ్రెస్ ‘రెడ్డి’ కార్డుకు కేసీఆర్ బీసీ కౌంటర్.. ఎమ్మెల్సీ పోరులో ఊహించని ట్విస్ట్!
BC Strategy: తెలంగాణ రాజకీయాలు మరో రసవత్తర ఎన్నికల సమరానికి వేదికవుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు కీలక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పోరు ప్రధాన పార్టీల మధ్య జీవన్మరణ సమస్యగా మారింది. అధికార కాంగ్రెస్ ఓవైపు కండబలంతో పావులు కదుపుతుంటే, అసెంబ్లీ ఓటమి నుంచి కోలుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి వ్యూహాలతో సమరశంఖం పూరించింది. రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ సమరమే అసలైన 'రిఫరెండం'గా మారబోతోందన్న అంచనాల నడుమ, గులాబీ అధినేత కేసీఆర్ వేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఎత్తుగడలు అధికార పక్షానికి సవాల్ విసురుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
