తెలంగాణ

అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. నల్ల దుస్తులు ధరించి లోపలికి రాకూడదని పోలీసులు అడ్డుచెప్పడంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు భగ్గుమన్నారు. నల్లదుస్తులు ధరించి రాకూడదని ఎవరూ చెప్పారంటూ పోలీసుల మీద ఫైర్ అయ్యారు.సమావేశాలు ప్రారంభానికి ముందు గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అయితే,నల్ల దుస్తులు ధరించారనే కారణంతో పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.దీంతో అక్కడ పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు టీ షర్టు విప్పేసి అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించగా.. అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.