తెలంగాణ
మృత్యువుతో పోరాటం..అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతి
అమెరికాలో జరిగిన ప్రమాదంలో గత రెండు వారాలుగా ప్రాణాలతో పోరాడిన తెలంగాణ వాసి మృతి చెందాడు. ఫ్లోరిడాలో జులై 25వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూర్‌పల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. 75 శాతం కాలిన గాయాలతో ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. గత 15 రోజులుగా మృత్యువుతో పోరాడి భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తోంది.
