తెలంగాణ
Bathukamma Sarees: దసరా పండుగకు బతుకమ్మ చీరల్లేవ్.. ఈసారి అందరికీ అందడం అనుమానమేనా?
Bathukamma Sarees: తెలంగాణ ఆడపడుచులకు దసరా, బతుకమ్మ పండుగల వేళ అందాల్సిన ఉచిత చీరల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా పండుగకు ముందే పల్లెపల్లెనా సందడి చేస్తూ చేతికందే బతుకమ్మ చీరల పంపిణీ ఈసారి లేట్ కావడంతో అసలు ఇస్తారా లేదా అనే అనుమానాలను ఆడపడుచులు వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజులు సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ ప్రారంభం కాకపోవడం, మరోవైపు ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంలో ఉండటంతో మహిళల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలు, యువతుల సంఖ్య సుమారు 1.68 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 1.05 కోట్ల చీరల తయారీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది.
