తెలంగాణ

పెత్రమాసం నుంచి తెలంగాణ ఆత్మగా బతుకమ్మ.. తొమ్మిది రోజుల పూల పండుగ వెనుక అసలు కథ ఇదే!

తెలంగాణలో బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చి ఆడుకునే పండుగ కాదు. అది ఆడబిడ్డల అనుబంధం.. ప్రకృతితో ముడిపడిన జీవన విధానం.. తరతరాలుగా వస్తున్న జానపద సంపద. పెత్రమాసం రోజున ప్రారంభమయ్యే ఈ పూల పండుగ.. తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాలను పాటలతో, పూల సోయగాలతో నింపేస్తుంది.