ATM: సమ్మె టైంలో ఏటీఎం బాదుడు బంద్.. కస్టమర్ల కోసం ప్రత్యేక వెసులుబాటు!
ATM: వారంలో అయిదు పనిదినాలు అమలు చేయాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది చేపడుతున్న సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో, ఖాతాదారులు నగదు కష్టాలు పడకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర జాతీయ బ్యాంకులు ప్రత్యేక సడలింపులను ప్రకటించాయి. సమ్మె కాలంలో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేకుండా ఏటీఎంలను ఫ్రీగా వాడుకునేందుకు పచ్చజెండా ఊపాయి.సమ్మె కొనసాగే ఆ మూడు రోజులు సామాన్యులపై పైసా భారం పడకుండా ప్రభుత్వ బ్యాంకులు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా ఎలాంటి చార్జీలు వర్తించవు. సాధారణంగా ఉండే లావాదేవీల పరిమితితో సంబంధం లేకుండా ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు.
