తెలంగాణ

Bandi : టెన్షన్ టెన్షన్.. పాతబస్తీకి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేడు పాతబస్తీకి వెళ్లనున్నారు. బోనాల సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లనున్నారు. బండి సంజయ్ వస్తున్నారని తెలియడంతో పెద్దఎత్తున అక్కడ బందోబస్తు, ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. బోనాల సమయం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలుస్తోంది. బీజేపీ శ్రేణులు, మరికొందరు కీలక నేతలు సైతం ఆయన వెంట పాతబస్తీకి వెళ్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం. అయితే, కేంద్రమంత్రి వస్తున్న నేపథ్యంలో సెన్సిటిల్ ఏరియా అయిన పాతబస్తీలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా మరింత పెంచారు.