ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్కు రాజకీయ నిమజ్జనమే.. : బండి సంజయ్
Bandi Sanjay: అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాల మాదిరిగా ఫాంహౌజ్ల చుట్టూ తిరగడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్కు రాజకీయ నిమజ్జనమే అని అన్నారు. ఫాంహౌజ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న రచ్చను బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. "ఫాంహౌజ్ ఏమైనా ప్రజలు వెళ్లి చూసొచ్చే టూరిస్ట్ కేంద్రమా? అనుమతి లేకుండా ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? అసలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై ఉంటే, లేదా భూదోపిడీ జరిగి ఉంటే వెంటనే ఆధారాలతో సహా బయటపెట్టి వాటిని స్వాధీనం చేసుకోండి. అంతేకానీ, దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఈ విజిట్లు, హడావుడి దేనికి? ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శల కోసం అక్కడికి వెళ్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ అధికారంలో ఉండి కూడా ఈ రకమైన విన్యాసాలు చేయడం విడ్డూరంగా ఉంది" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
