తెలంగాణ

TG: కేటీఆర్‌ నన్ను వేధిస్తున్నాడు.. బల్మూరి ఇందూజ సంచలన ఆరోపణలు

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చిక్కుల్లో పడ్డారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆశ్రయించారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ శ్రేణులు, కేటీఆర్ అనుచరులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ నిరంతరం మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఇందుజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలు, సపోర్ట్‌తోనే నెట్టింట తనపై ఈ స్థాయి దాడి జరుగుతోందని ఆమె ఆరోపించారు.