International

బాలిస్టిక్ క్షిపణి దాడి.. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ప్రధాని!

 మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. యెమెన్ తాత్కాలిక రాజధాని ఏడెన్‌లోని చారిత్రాత్మక అల్-మాషిక్ (Al-Maashiq) అధ్యక్ష భవన ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు గురువారం భీకర బాలిస్టిక్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో భవనంలోనే ఉన్న యెమెన్ ప్రధాని షయా అల్-జిందానీతో పాటు ఇతర కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.